Saturday , October 12 2024

మణిగిల్లలో పుట్టుచీర పుట్టు పంచె కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిది ఏప్రిల్ 28:

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ ప్రస్తుత మాజీ సర్పంచ్ మేరెడ్డి సరిత తిరుపతి రెడ్డిల కుమార్తె శ్రీహితారెడ్డి, పుట్టు చీర, కుమారుడు నిక్షిత్ రెడ్డి పుట్టు పంచె కార్యక్రమానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి, శారదా రెడ్డి దంపతులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు

ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దంపతులతో ఫోటోలు దిగుతు కాసేపు సందడి చేశారు

కార్యక్రమంలో వనపర్తి పట్టణం వనపర్తి పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, పెబ్బేరు, గోపాల్ పేట, కొత్తకోట మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు, పార్టీ శ్రేణులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు