Monday , September 16 2024

నూతన గృహప్రవేశం పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

వనపర్తి పట్టణం ఆరో వార్డుకు చెందిన గోపీనాయక్ గృహప్రవేశం కూతురు పుట్టు చీర ఫంక్షన్ కార్యక్రమానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.
ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే అనంతరం పుట్టుచీర కార్యక్రమానికి హాజరై చిన్నారి ప్రన్యూషను ఆశీర్వదించారు

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్, నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మన్నెంకొండ, రంగాపురం రామచంద్రారెడ్డి, చీకరుచెట్టు తండా మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, కోడేరు మాజీ జెడ్పిటిసి బస్తీ రామ్ నాయక్, తెల్ల రాళ్లపల్లి మాజీ సర్పంచ్ వాళ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు