Tuesday , July 16 2024

మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ రాక*

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి& జిల్లా మీడియా ఇన్ఛార్జి పెద్దిరాజు*

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 25

భారతీయ జనతా పార్టీ

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మార్చి 26 మంగళవారం ఉదయం 10 గంటలకు లక్ష్మి కృష్ణ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ పార్లమెంటు సభ్యులు పి రాములు బిజెపి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోక్ నాథ్ రెడ్డి పాల్గొననున్నారని పెద్దిరాజు తెలిపారు.

మే 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ విజయానికై నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు అందరూ గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలుస్తూ పార్లమెంటు ఎన్నికలలో బిజెపి లక్ష్యంగా పెట్టుకున్న 400 ఎంపీ స్థానాలలో నాగర్ కర్నూల్ కూడా ఉండేలా మరియు మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ని గెలిపించేలా రాబోవు 50 రోజులలో పార్టీ కార్యక్రమాల రూపకల్పన మరియు లక్ష సాధనకై ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఈ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని 296 బూత్ లలో ప్రతి బూత్ నుండి పదిమంది కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.