Tuesday , July 16 2024

ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలని!!

వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు విజ్ఞప్తి!!

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చ్ 24

ఈనెల 25న జరుపుకుంటున్న హోలీ పండుగను ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అలజడలు అరాచకాలు గొడవలు చేయకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం రావు , వనపర్తి టౌన్ ఎస్ఐ జయన్న తెలిపారు, రేపు సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న హోలీ పండుగను వనపర్తి పట్టణంలో పాటు వనపర్తి సర్కిల్ పరిధిలోని మీద గ్రామాలలో మండలాలలో రాజకీయ పార్టీల నాయకులు యువకులు, విద్యార్థులు, మహిళలు, ప్రతి ఒక్కరు హోలీ సంబరాలను ఆనందోత్సవాల మధ్య ప్రశాంతంగా నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలవకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని అన్నారు, హోలీ సందర్భంగా యువకులు మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్ల పైన త్రిబుల్ రైడింగ్ ద్విచక్ర వాహనాలను నడుపుతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు, అంతేకాక హోలీ పండుగ సమయానికి పూర్తి చేయాలని ఆ తర్వాత స్నానాలకు వెళ్లాలనుకున్న చిన్న పిల్లలు చెరువులలో కుంటలలో కి స్నానాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్త పాటించాలని వారు పిలుపునిచ్చారు, ప్రశాంత వాతావరణంలో ఉన్న వనపర్తి అభివృద్ధి కోసం శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి కృషి చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు, ముఖ్యంగా యువత తగు జాగ్రత్తతో ఈ పండుగను జరుపుకోవాలని సీఐ కోరారు,