Monday , September 16 2024

డా.మల్లురవి గారిని నాగర్ కర్నూల్ ఎంపీ గా గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తాం

తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షులు సతీష్ మాదిగ*

టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్*
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 22

కాంగ్రేస్ వాది, తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన కాంగ్రేస్ పార్టీ చాణిక్యుడు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేసే నిజమైన అంబేద్కర్ వాది, పేద ప్రజల గొంతుకై గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుల మత బేధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవ్వరికి కష్టం వచ్చిన పిలిస్తే పలికే మల్లురవి అని పేరు తెచ్చుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు డా. మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి కి బహుమతి గా ఇస్తాం అని తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షులు సతీష్ మాదిగ , టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ అన్నారు. అదే విదంగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లురవిని ఎన్నిక చేసినందుకు తెలంగాణ తల్లి సోనియా గాంధికి , ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కి ,రాహుల్ గాంధీ కి ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నాయకులకు , టీపీసీసీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు