Wednesday , July 24 2024

ఎన్నికల ప్రవర్తన నియమా వాళ్ళకి అనుగుణంగా ఎన్నికలు జరిగే విధంగా రాజకీయ నాయకులు సహకరించాలి

వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవర్

 తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 18      
 వనపర్తి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఎన్నికలు నైతికంగా జరిగే విధంగా తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ రాజకీయ పార్టీలను సూచించారు. 
  మార్చి, 16వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి అవగాహన సమావేశం నిర్వహించారు. 
  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటి అనేదానిపై ప్రతినిధులకు అవగాహన కల్పించారు. 
కొత్తగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టరాదని, ప్రచార కాన్వాయ్ లో 10 కార్లకంటే ఎక్కువ పెట్టడానికి వీలు లేదన్నారు. ప్రచారానికి సంబంధించి అన్ని అనుమతులు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మీడియాలో ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానటరి కమిటీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. స్టార్ క్యంపెనర్లు వచ్చినప్పుడు నిబంధనలు ఏ విధంగా ఉంటాయో వివరించారు. ప్రచారానికి సంబంధించి వాడే వాహనాలు, టోపీ లు, బ్యానర్లు, కర పత్రాలు, ఫ్లెక్సీ లు, భోజనాలు ప్రతి దానికి రెట్ చార్ట్ ప్రకారం ఖర్చులు లెక్కించి పార్టీ, అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ అభ్యర్థి గరిష్టంగా 95 లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసుకోవచ్చని తెలియజేశారు. 
 లిక్కర్, డబ్బు పంపిణీ, ప్రలోభాలు వంటివి ఏ స్థాయిలో జరిగిన డేగ కండ్లతో పసుగట్టడానికి మా బృందాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దని తెలియజేశారు. కలెక్టరేట్ లో సమీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం, నిర్వహణ పై నిఘా పెట్టడం జరిగిందన్నారు. 

ఏప్రిల్, 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే యువత ఓటరు జాబితాలో ఒరు నమోదు చేసుకోవడానికి 29 ఏప్రిల్, 2024 వరకు ఆకాశం ఉందని తెలిపారు.
85 సంవత్సరాల వయస్సు నిండిన సీనియర్ సిటిజన్లు, డివ్యాంగులు అందరికీ ఫారం 12డి ఇవ్వడం జరుగుతుందని వీరిలో ఎవరైనా తన ఇంటి నుంచే ఓటు వేయాలని అనుకునేవారు పూరించిన ఫారం 12 డి నీ ఏప్రిల్ 22వ తేదీ లోపల ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా అత్యవసర సేవలు అందించే డాక్టర్లు, సైనికులకు సైతం ఫారం 12డి ఇచ్చి వారికి ఓటర్ ఫెసిలిటేశన్ సెంటర్లో ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలీస్ లకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 296 , 11ఆగ్జిలరి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వనపర్తి జిల్లా మొత్తం లో 563 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల ఫిర్యాదు చేయడానికి సి విజిల్ యాప్ అందుబాటులో ఉందని, ప్రజలు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఓటర్లు అందరికీ ఓటరు స్లీప్ లు ఇవ్వడం జరుగుతుందనీ వారి ఒరుకు సంబంధిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులు, వయో వృద్ధులు పోలింగ్ కేంద్రంలో వారికి ఏమైనా సేవలు కావాలనుకుంటే ముందుగానే సక్షం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.
ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నైతికంగా జరిగే విధంగా తమ వంతు కృషి చేయాలని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, వివిధ పార్టీల నుండి ప్రజాప్రతినిధులు బి.ఆర్.ఎస్. నుండి జమిల్, బి.జే.పి నుండి డి. ప్రవీణ్, బి. కుమార స్వామి, కాంగ్రెస్ నుండి వేణాచారి, సి.పి.యం నుండి యం.పరమేశ్వర చారి, టి.డి.పి నుండి కే. శంకర్ తదితరులు పాల్గొన్నారు.