Tuesday , July 16 2024

మృతుడి కుటుంబానికి ఎమ్మేల్యే ఆర్థిక సాయం

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా
ప్రతినిధి ఫిబ్రవరి 16:

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన తెలుగు చాపల బీసన్న గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ రెడ్డికి తెలియజేయగా ఎమ్మేల్యే మేఘారెడ్డికి ఇట్టి విషయాన్ని తెలుపగా స్పందించిన మేఘారెడ్డి దాతృత్వం చాటుకున్నారు.5వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ పెద్దింటి చంద్రయ్య,గ్రామ అధ్యక్షుడు చిన్నోడు,బాపన్ పల్లి రమేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దారపోగు వెంకటేష్,పెద్దింటి రామకోటి,మాజీ వార్డు మెంబర్ ఆంజనేయులు, కటికల బీసన్న, చిన్న కురుమన్న,మృతుని కుటుంబానికి శుక్రవారం అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఎమ్మేల్యే మేఘారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు