టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తాటిపాముల ఎంపీటీసీ అంకే పార్వతమ్మ*
_బీటలువారుతున్న .. టిఆర్ఎస్
ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీటీసీ తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా మార్చి 18 శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ ఎంపీటీసీ శ్రీమతి అంకె పార్వతమ్మ ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు*_
గ్రామ, మండల నాయకుల సమక్షంలో ఎంపిటిసి తోపాటు మండల. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంకె వెంకటయ్య, మాజీ సర్పంచ్ గంధం బజారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు
టిఆర్ఎస్ పాలనలో ఎంపిటిసి లకు ఎలాంటి గుర్తింపు లేదని…ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని నేడు కాంగ్రెస్ పార్టీ తమను గుర్తించి ప్రాధాన్యత కల్పించడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు
కార్యక్రమంలో బీరం రాజశేఖర్ రెడ్డి, సత్య శీలా రెడ్డి గంధం రాజశేఖర్, కురుమన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు