Wednesday , July 24 2024

మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి అశ్విని రాధమ్మ

నియమించిన జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ*

భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి అశ్విని రాధమ్మకు నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు డి. నారాయణ.
తెలంగాణ కెరటం వనపర్తిజిల్లా ప్రతినిధి 18

పెద్దమందడి గ్రామానికి చెందిన శ్రీమతి అశ్విని రాధమ్మ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించి రెండు పర్యాయాలుగా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ నేడు జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీమతి అశ్విని రాధమ్మ మాట్లాడుతూ బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్ బి.శ్రీశైలం శ్రీమతి జ్యోతి రమణ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ విస్తరణకై నిరంతరం శ్రమించి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యులు సబ్బి రెడ్డి వెంకట్ రెడ్డి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మహిళా మోర్చా రాష్ట్ర సహా కోశాధికారి జ్యోతి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి సుమిత్రమ్మ బండారు కుమారస్వామి ఏ సీతారాములు ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి కోశాధికారి భాసెట్టి శీను పార్లమెంట్ కో కన్వీనర్ ప్రవీణ్ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కల్పన జిల్లా కార్యదర్శులు చిత్తారి ప్రభాకర్ ముప్పూరు చెన్నయ్య బోయెల్ల రామ్మోహన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి సుగురు లక్ష్మి శ్రీమతి కవిత శ్రీమతి సరోజ తదితరులు పాల్గొన్నారు.