Thursday , May 23 2024

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 17

వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన శివశంకర్ కరెంట్ షాక్ కు గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు.ఇందుకు సంబంధించి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో సి ఆర్ ఎం ఎఫ్ మంజూరికి దరఖాస్తు చేసుకోగా ..రూ 60 వేలు మంజూరయ్యాయి.మంజూరైన చెక్కును శనివారం ఎమ్మెల్యే వనపర్తి లోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.గత ప్రభుత్వ పాలనలో సీఎం మారెఫ్ చెక్కుల మంజూరికి సంవత్సరాల తరబడి ఎదురుచూసే వాళ్ళమని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే తమకు చెక్కులను మంజూరు చేసిందని లబ్ధిదారుడు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో మండల నాయకులు సత్యశీలరెడ్డి, శివన్న, చంద్రశేఖర్,మల్లేష్, నాగ శేషు, వెంకటయ్య, వెంకట్రాములు, భాస్కర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.