Sunday , May 26 2024

చిన్నారెడ్డిని కలిసిన పూరి సురేష్ శెట్టి

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా మార్చి 17
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డిని శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకి అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దశల వారి ఉద్యమాలు నిర్వహించామని, దీని ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని కార్పొరేషన్ ఏర్పాటుకు పోరాటాల నిర్వహించిన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక విషయంలో సేవా దృక్పథం కలిగిన వ్యక్తికి ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయించాలని దీని ద్వారా ఎంతోమంది నిరుపేద ఆర్యవైశ్యులకు మేలు జరుగుతుందని పూరి సురేష్ శెట్టి కోరారు. సానుకూలంగా స్పందించిన చిన్నారెడ్డి సురేష్ శెట్టి అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమలు దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.