Wednesday , July 24 2024

బారాసా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జింకల కృష్ణయ్య వారి కుమారుడు జింకల రాజు

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన:

*—డాక్టర్ జి చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు.ఏఐసిసి కార్యదర్శి.

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 3

వనపర్తి పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బారసా నుంచి జింకల కృష్ణయ్య వారి కుమారుడు రాజు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పెద్దలు మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్లలో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ నందిమల్ల యాదయ్య ముదిరాజు సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐ సత్య రెడ్డి,అల్వాల లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.