Monday , September 16 2024

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష విజయవంతం

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు: వేముల నాగరాజు

(తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి ఫిబ్రవరి 18

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ వెంకటేశ్వర ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధోశక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని విజ్ఞానవంతులుగా మేధావులుగా తయారవాలన్నారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలన్నారు. ఉద్యమాలతో పాటు విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించడం వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు అదే విధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై పోరాడడం కాకుండా పరీక్షల పై అవగాహన పెంపొందించేందుకు వారిలో ఉన్న భయాన్ని తీసేసి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు. టాలెంట్ టెస్టులో సుమారు 200కు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. త్వరలో మండల వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ర్యాంకులు వచ్చిన వారికి షీల్డ్ లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ పొలేపాక విష్ణు, బోలుగుళ్ళ కావ్య, బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ ఎస్,కే ఫర్దిన్, మైసొల్ల నరేందర్, డి. నేహ, సాయి, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.