చలివేంద్రం ప్రారంభించిన మండల బీసీ సంఘం అధ్యక్షులు: సాయిని యాదగిరి
తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి ఏప్రిల్ 15
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని తోరూర్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం రోజున వలిభాష పేరున హజామ్ అతని కుటుంబ సభ్యుల సౌజన్యంతో చలి వేంద్రంను మండల బి.సి. సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రంను ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలలో ఎండలు బాగా ఉన్నందున రోడ్డు వెంబడి వెళ్లి పాదాచారులకు రైతులకు ప్రజలకు దహము తీర్చేందుకుగాను వలిగొండ పట్టణానికి చెందిన అజాం కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ చలివేంద్ర కేంద్రం నిర్వహించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ప్రజల దాహార్తిని తీర్చే ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వేసవిలో వేసవి తాపాన్ని నీరు త్రాగి తీర్చుకోగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిని బిక్షపతి గౌడ్, గంజి మహేష్, గంజి తిరుమలేష్, మత్స్యగిరి, గౌస్, ఫరీద్, సాయికృష్ణ,బీసీ నాయకులు పట్టణ ప్రజలు అజామ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.