Thursday , May 23 2024

మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి ఘనంగా నివాళులు

(తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి ఏప్రిల్): 11

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి పురస్కరించుకొని ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే మహారాష్ట్రలోని పూనే సత్తార్ జిల్లాలు 1827 ఏప్రిల్ 11న జన్మించారు అప్పుడున్న పరిస్థితులలో మహాత్మ జ్యోతిబాపూలే చదువుపై ఎంతో మక్కువ పెంచుకొని తన తండ్రిని ఒప్పించి చదువుకొని. ఎన్నో ఉద్యోగ బుద్ధులు నేర్చుకొని పూలే చురుకైన వ్యక్తిగా ఉన్నారు అదే సందర్భంలో తన స్నేహితుని పెళ్లికి వెళ్ళినప్పుడు అంటరాని వాడు బ్రాహ్మణుల పెళ్ళికి వస్తాడా అని పూలేను గెంటివేశారు. ఎంతో చలించి పోయిన పూలే ఈ దేశంలో అంటరానితనం కుల వ్యవస్థని రూపుమాపడం కోసం ఉద్యమం చేశాడు హక్కులు సాధించి పెట్టిన పూలే మహారాష్ట్రలో చదువు కోసం సొంతంగా పాఠశాలలు నెలకొల్పి పేదలందరికీ చదవనందించిన మహా వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దుబ్బ దానయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచంద్ర,మాల మహానాడు జిల్లా నాయకులు రాపుల్ పవన్ కుమార్, కందుల అంజయ్య, పోలపాక బిక్షపతి, పోలేపాక సతీష్, శంకర్, మోతి మల్లేశం రాపోలు పవన్ కుమార్ లింగస్వామి, విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు బత్తిని బిక్షపతి, కవిడే రామ్, నాగరాజ్,సాంబ తదితరులు పాల్గొన్నారు