-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి
(తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి) ఏప్రిల్ 8
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో 300 కుటుంబాలకు రెండు వాటర్ ప్లాంట్లు ఉండగా తక్కువ సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ ను పివి శ్యాంసుందర్రావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి విరాళం నుండి వాటర్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. అట్టి వాటర్ ప్లాంట్ చెడిపోయి శిథిలావస్థలో ఉన్నది గ్రామ సర్పంచ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత గ్రామపంచాయతీలను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. వర్షాలు తక్కువ పడడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్య పెద్ద సమస్యగా ఏర్పడిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి అన్నారు. దాతలు సహకారం లేక ఇబ్బందుల పాల్గొనవుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్లు స్పందించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో స్పందించి ప్రతిపాదనలు తీసుకొని నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.