Saturday , October 5 2024

దేశంలో మోడీ భువనగిరిలో బూర గెలుపు కాయం:


జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్

(తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి) ఏప్రిల్ 8

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని అన్నారు వారిని ఇంటి ఇంటికి వెళ్లి వారిని కలిసి ఓటును అభ్యర్ధించాలని అన్నారు ,ప్రధాని నరేంద్ర మోడీ గెలుపు బూత్ ఓటర్ల పైన వుంటుంది అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి బూత్ అద్యక్షులు బూత్ కార్యకర్తలు బూతుల లో పని చేయాలని అన్నారు, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జీ కిషన్ రెడ్డి గారు భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించ బోయే బారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు,రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు, స్వాతంత్రం వచ్చినప్పటినుండి 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో పేదలు పేదలు గానే ఉన్నారని, గడిచిన పది సంవత్సరాల బిజెపి పాలనలో పేదల కొరకు,యువత కొరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం స్వయం ఉపాధి పొందే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కందుల తానీషా గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్, మాజీ మండల అధ్యక్షులు నాగేల్లి సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కణతాల అశోక్ రెడ్డి ,శీలోజు శ్రీరాములు, బందారపు రాములు,మంద నరసింహ,బొడిగే ఆనంద్,పాక పుల్లయ్య, మండల ఉపాధ్యక్షులు రావుల పద్మా రెడ్డి, దయ్యాల వెంకటేశం గంగదారి దయాకర్, మండల కార్యదర్శులు మైసోల్ల మచ్చ గిరి, బైరు మల్లేశం మందుల నాగరాజు , బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెలిమినేటి వెంకటేశం ,మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం, దళిత మోర్చా అధ్యక్షులు పల్లెర్ల నరసింహ, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ సోషల్ మీడియా కన్వీనర్ రాస శ్రీశైలం ,బుంగమట్ల మహేష్, పెరిక వెంకటేష్, రాజేశ్వర చారి, జినుకల మల్లయ్య,దాసు తదితరులు పాల్గొన్నారు