Sunday , May 26 2024

ఉరేసుకొని వ్యక్తి మృతి.??

ఎస్సై రంజిత్ కుమార్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 16:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన పిట్టల కృష్ణ తండ్రి రాజు, వయస్సు( 38) సంవత్సరాలు, వృత్తి కూలి అను వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య అతనికి దూరంగా ఉంటుంది. చిన్న భార్య అతని వద్దనే ఉండగా, సంసార విషయంలో గొడవలు కాగా ఈ మధ్యకాలంలో అతను తాగుడుకు బానిస అయి జీవితం మీద విరక్తి చెంది, నిన్న రాత్రి గుడిసెలోని ఉరి వేసుకొని మరణించినాడు. ఈ విషయంపై అతని తల్లి అయినా అంజమ్మ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది.