మక్తల్ కు మూడు కిలోమీటర్ల దూరంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోని పోలీసులు‼️
ఆత్మహత్య చేసుకున్న కేసు నమోదు చేయర
మనోవేదన తో వ్యక్తి ఆత్మహత్య.కేసు నమోదులో పోలీసుల జాప్యమేల…?తెలంగాణ కెరటం క్రైమ్ రిపోర్టర్, నారాయణపేట,వ్యవసాయ పనుల కోసం చేసిన అప్పు తనకున్న పొలంలో ఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని గ్రామ పెద్దలతో జరిగిన పంచాయతీలో ఒప్పుకోగా. మోసపూరితంగా మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఈ విషయం తెలిసి నిలదీయగా తనకున్న రాజకీయ బలంతో అవమానపరిచి బెదిరించడంతో మనస్థాపంతో ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకుని గ్రామంలో గురువారం రోజు జరిగింది పోలీసులకు సమాచారం ఉన్న స్పందించ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి అదిరింపులతో ఓ కుటుంబం సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది కానీ పోలీసులు స్పందించలేదు. వివరాల్లోకెళ్తేనారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని వనాయకుంట గ్రామంలో కృష్ణా (39) వ్యవసాయం కోసం తనకున్న కొద్దిపాటి పోలంలో బోర్లు వేయడానికి పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకొని తన భూమి ఒక ఎకరా గిరి రిజిస్ట్రేషన్ పేరుతో చేయించారు అని సదరు వ్యక్తి అధికంగా భూమి చేయించుకున్నాడు తన అమాయకత్వాన్ని ఆసరగా ఎక్కువ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకొని నిలదీయగా సదరుఆ వ్యక్తి తరచుగా వేధింపుల గురిచేస్తూ 20 లక్షల ఇవ్వాలని వేధింపులకు గురి చేశారని ఈ విషయాన్ని గ్రామస్తులతో తెలుపగా అధికార పార్టీ చెందిన నాయకుడు కావడంతో బెదిరించడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణ ఆత్మహత్య చేసుకున్న పంచు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.అయిన విషయం పోలీసులకు తెలిసిన కేసు ఎందుకు నమోదు చేయలేదు అని వివిధ ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు, కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీసులపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేయలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకు గాను జిల్లా అధికారులు స్పందించి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు, లేదంటే ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన లేవా చేస్తామని వారు అంటున్నారు.