తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి ఆలయంలో మానవతావాది,ప్రముఖ సమాజ సేవకులు,ఆపదలో ఉన్నవారికి ఎల్లవేళలా ఆపన్న హస్తాన్ని అందించే ఉప్పల శ్రీనివాస్ గుప్తా 51వ జన్మదిన సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ అనునిత్యం ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ 7500 మంది అమ్మాయిల పెళ్లిళ్లకు పుస్తేమట్టలను అందజేసిన గొప్ప మానవతావాది అని, పేదవారి చదువుల నిమిత్తమై, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న గొప్ప మానవతావాది అని ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేస్తున్న సేవలను కొనియాడడం జరిగింది.వారి కుటుంబానికి శ్రీ అమ్మ భగవానులు ఆర్థికంగా, రాజకీయంగా,ఆరోగ్యపరంగా ఉన్నత స్థితిని కలిగించాలని అమ్మ భగవానులకు ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
అన్నదానానికి ముందుకు వచ్చినందుకు వారికి ఆలయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్,కోమిరిశెట్టి దిగంబర్, ఎర్రం విజయ్ కుమార్,పాత స్వరూప,నీల రజని,ఎర్రం దివ్య,పప్పుల శ్రావణి,పబ్బ జ్యోతి లు పాల్గొనడం జరిగింది.