Tuesday , July 16 2024

రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

తెలంగాణ కెరటం/ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మే 20:

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. ఆదివారం వర్దన్నపేట మండల కేంద్రంలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ధాన్యం తడిసిన రైతులతో మాట్లాడి వారికి మనో దైర్యం కల్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని రైతులు ఎవ్వరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వర్దన్నపేట జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైస సురేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఐత ప్రవీణ్, శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.