5 బ్రాంచిలలో 1600 మంది దగ్గర సుమారు 3 కోట్ల వరకు వసూలు
ఇద్దరి నిందుతుల మీద రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో 05 కేసులు నమోదు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
సెప్టెంబర్:-02
ఉజ్వల చిట్స్ అండ్ క్రెడిట్ సొసైటీ
ముచ్యువల్లీ ఎయిడెడ్ కో-అపరేటివ్ సొసైటీ ప్రారంబించి ప్రజల దగ్గర నుండి వివిధ స్కీమ్ లలో ప్రజల వద్ద నుండి సుమారు మూడు కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెట్టిన నిందు తులను వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్బంగా మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన
కర్ణ శ్రీధర్ (49), జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం
చేగ్యం గ్రామానికి చెందిన పోతరాజుల లక్ష్మణ్ (39) లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి టిఎస్-19-7943 (టాటా జెస్ట్ )కార్, సొసైటికి సంబందిచిన కరపత్రాలు, పాస్ బుక్స్, అకౌంట్ ఓపెనింగ్, క్లోసింగ్ ఫార్మ్స్, లావాదేవీలకు సంబందించిన రిజిస్టర్స్,మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు వీరిరువురు
2000 సంవత్సరములో మంచిర్యాల జిల్లా లో ఉజ్వల చిట్స్ అండ్ క్రెడిట్ సొసైటీ , ముచ్యువల్లీ ఎయిడెడ్ కోఅపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే సంస్థ స్టాపించి 6 నెలల తేడాతో బెల్లంపల్లి
లక్షేట్టిపేట, సిరిసిల్ల
వేములవాడ నందు సొసైటిలు స్థాపించి సొసైటిలో మొత్తం దాదాపు 1600 మంది వరకు అకౌంట్స్ ఓపెన్ చేశారు సుమారు వాటి విలవ మూడు కోట్ల వరకు ఉంటుంది. ఈ కంపెనీ యెక్క వ్యాపార లావాదేవీలు చూసుకొనుటకు శ్రీధర్ పూర్వ విద్యార్థి అయిన పోతరాజుల లక్ష్మణ్ తో కలిసి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఇట్టి సొసైటికి శ్రీధర్ చైర్మన్ గా లక్ష్మణ్ సిఈఓ గా సొసైటి లో పనిచేయుటకు గాను కొంత మంధి సిబ్బంధిని కూడా నియమించుకొని ప్రజలను నమ్మించి అమాయక ప్రజల దగ్గర నుండి రీకరింగ్ డిపోసిట్స్ ల ద్వారా డబ్బులు వసూలు చేసి వచ్చిన డబ్బులని శ్రీధర్, లక్ష్మణ్ వారి స్వలాభం కోసం మంచిర్యాల, నిజామాబాద్ జిలాల్లో రియల్ ఎస్టేట్, లిక్కర్
చిట్ ఫండ్స్ బిజినెస్ లలో పెట్టుబడికి ఉపయోగించారు.అదేవిధంగా ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ లను 1) ఐసీఐసీఐ 2) బ్యాంక్ ఆఫ్ భరోడా 3) యూనివర్సల్ కో-
అపరేటివ్ అర్బన్ బ్యాంక్ లలో ఖాతాలు తెరిచి వాటి ద్వారా ఈ సొసైటి కి సంబందించిన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు సిరిసిల్లలో 2001
వేములవాడ లో 2022 సంవత్సరం లో ఉజ్వల చిట్స్ అండ్ క్రెడిట్ సొసైటీ , మూట్యుయల్లీ ఎయిడెడ్ కో-అపరేటివ్ సొసైటీ ప్రారంబించి ప్రజల దగ్గర నుండి వివిధ స్కీమ్ లలో దాదాపు 150 మందికి పైగా సభ్యత్వం కల్పించి సొసైటిలో అకౌంట్ ఓపెన్ చేయుటకు ఒక్కొక్క ఖాత దారునినుండి 650/- రూపాయలు వసూలు చేశారు
డైలీ సేవింగ్స్ స్కీమ్ నందు పొదుపు చేసిన డబ్బులపై 8.50% వడ్డీ , గోల్డ్ సేవింగ్ స్కీమ్ పొదుపు చేసిన డబ్బుల పై 5% వడ్డీ , ఫిక్సెడ్ డెపోసిట్ ల పైన 12% వడ్డీ, డెపోసిట్ చేసిన డబ్బు6% ఫిక్సెడ్ రెట్టింపు అవుతుంది అని కరపత్రాలు తయారు చేసి ప్రజలను నమ్మించారు గత నెల 22-08-2023 రోజున వేములవాడ కి చెందిన బుస్స శ్రీనివాస్ మరియు బాధితులు ఈ సొసైటీ లో మోసపోయామని గ్రహించి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా శ్రీధర్, లక్ష్మణ్ లు కరీంనగర్ నుండి సిరిసిల్ల కు వస్తుండగా వేములవాడ టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వేములవాడ నంది కమాన్ వద్ద ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు శ్రీధర్,లక్ష్మణ్ ల పైన వేములవాడ టౌన్ పోలీసు స్టేషన్ లో మూడు కేసులు, బెల్లంపల్లి I టౌన్ పోలీసు స్టేషన్ ఒక కేసు ,మంచిర్యాల టౌన్ పోలీసు స్టేషన్ లలో మొత్తం కేసు మొత్తం 5 కేసులు నమోదు అయినట్టు తెలిపారు ఈ సొసైటీ లో మోసపోయిన బాధితులు నిర్భయంగా పిర్యాదు చేయాలని,అనుమతి లేని కోపరేటివ్ సంస్థలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్ తెలిపారు