Saturday , October 12 2024

తూతూ మంత్రంగా పంట, నష్ట పరిహారం సర్వే ….

పేరుకే హామీలు,పరిహారం మాత్రం సున్న

కిందిస్థాయి అధికారుల నీర్లక్షమే ప్రధాన కారణం

ప్రభుత్వ ఆలోచనను నీరుగాస్తున్న వ్యవసాయ అధికారులు

అరమ్య గోచరంగా తయారైన ,రైతన్న దిన పరిస్థితి

తెలంగాణ కెరటం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;

గత పదిహేను రోజుల నుండి అకాల వడగల్ల,వర్షానికి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించాలి అనే ప్రభుత్వా ఆలోచనకు అధికారులు నీరుగారుస్తు , ఆటు ప్రభుత్వాన్ని ,ఇటు రైతులకు నష్టాన్ని చేకూరుస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలను నష్టపరిహారాన్ని అందించాలని అని ,రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాల వారీగా కలెక్టర్ సర్వే రిపోర్ట్స్ ను ప్రభుత్వానికి అందించాలని, పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐతే ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న అధికారులు తీరు కనిపిస్తుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో పంట పొలాల దగ్గరికి వెళ్ళకుండానే నష్టపరిహారాన్ని సర్వే చేసినట్టుగా రైతుల దగ్గర పాస్ బుక్,పంట వివరాలు తీసుకొని నమోదు చేసినట్లు పలువురు రైతన్నలు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వలన నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరగడం లేదని నష్టపోయిన రైతులు అవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆలోచనను నీరుగారుస్తున్న ,అధికారుల వైఖరి

ఒక వైపు నష్టపోయిన రైతులను పరామర్శిస్తు జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ మే 02న నష్టపోయిన పంట పొలాలను సందర్శించి ,నష్టపోయిన బాధితులకు ఎకరానికి 10 వేల రూపాయలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ ను మరియు వ్యవసాయ అధికారులను సమగ్ర సర్వే నిర్వహించి ,పంట నష్టాన్ని గుర్తించి పూర్తి వివరాలను రిపోర్ట్స్ ఇవ్వలని ఆదేశించారు.జిల్లాలోని గ్రామాల వారీగా, సాగుదారుల (రైతులు, కౌలు రైతులు) వారీగా సర్వే చేపట్టి నష్టం వివరాలు పూర్తి గా పంపాలని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కేసీ ఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు కురిసిన భారీ వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు డిజాస్టార్ మేనేజ్‌‌‌‌మెంట్ నుంచి నిధులు ఇవ్వాలని సూచించారు. కాగా రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించాలని, ఏఓ, ఏఈవోలను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా పంట నష్టం జరిగిన గ్రామాల్లో ఏ పంటలు, ఎంత సాగయ్యాయి? ఏ రకం పంట దెబ్బతిన్నది? వివరాలను ఏఈవోలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలతోపాటు రైతుల పట్టాపాస్ బుక్‌‌‌‌లు, బ్యాంకు అకౌంట్‌‌‌‌ విరాలను ప్రత్యేక వెబ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తారు. వీటిని మండల స్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయశాఖ అధికారులు స్క్రూటినీ చేసి హైదరాబాద్‌‌‌‌లోని హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేసి.. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. కాని ఇక్కడ మాత్రం పంట పొలాల్లోకి వెళ్ళి సర్వేలు లేవు, కోనరావుపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా అధికారులు వ్యవ్యహరిస్తు ఏఓ, ఏఈఓలు గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్ళి ఏ ఏ పంటలు వేశారు,ఎంత వరకు నష్టపోయారు అని సమగ్ర సర్వే చేయాల్సిందిపోయి,వారి కార్యాలయాల దగ్గరికే రైతులను పిలిపించుకొని రైతు పాస్ బుక్,ఆధార్ కార్డ్ ఎంత నష్టపోయారు,ఎం పంట వేశారు అని వివరాలు నమోదు చేసుకొని తూతూ మంత్రంగా సర్వే రిపోర్ట్ పంపిస్తున్నారు అని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంగా వైఖరికి,నష్టపోతున్న అన్నదాత

అకాల వర్షాలు కారణంగా నష్టపోయిన రైతులకు,నష్టపరిహారం చెల్లించి, అదుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు,రాష్ట్ర ప్రభుత్వం 2 లేదా 3 రోజుల్లో సర్వే రిపోర్ట్ పంప్పవల్సింది గా ఉన్నత అధికారులను ఆదేశించాగా,కిందిస్థాయి అధికారులు సర్వేలు చేసి సమగ్ర రిపోర్ట్ పంప్పల్సింది పోయి,ఎవరైతే నష్టపోయారో వారే వాటికి సంబంధించి వివరాలను, పాస్ బుక్,పంట వివరాలు ,వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి నమోదు చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా రైతన్నకు నష్టాలు వాటిల్లితున్నప్పటికి ప్రభుత్వం సహాయం తో అడుపో, ధాడుపో నష్టపరిహారం అందుతుంది ఆన్న రైతన్న ఆశలు కాస్త కిందిస్థాయి అధికారులతో ఆవిరైపోతున్నాయి.అధికారులు ,పంట పొలాల దగ్గరికి వెళ్ళి ఎవరి పంట ఎంత నష్టపోయింది,ఎం పంట వేశారు,అనే పూర్తి వివరాలు సేకరించాల్సినది పోయి,రైతులే అధికారుల దగ్గరికి వెళ్లి నా పొలం గింత ,నాకు గింత నష్టం వాటిల్లింది అని పత్రాలు పట్టుకెల్లాలిన దుస్థితి నెలకొంది.అధికారులు పంట నష్టం వాటిల్లిన దగ్గరికి వెళ్తే ఏ పంట వేసారు,ఎంత నష్టం వాటినల్లింది ,ఎంత పరిహారం అనేది చేయచ్చు కానీ, రైతుల్నే అధికారుల వివరాల నమోదు చేసుకోవాలని అని అంటే, ఆసలు నష్టపోయినా రైతులకు న్యాయం జరిగేది ఎలా అనే రైతన్నలు వాపోతున్నారు.

ఉన్నత అధికారిని విధుల నుండి తొలగించిన, వీరి తీరు మారదే

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను గుర్తించి సమగ్ర సర్వే పంట నష్టం జరిగిన సర్వే రిపోర్ట్ అందించడం లో అలసత్వం గా ఉన్న జిల్లా వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీచేసిన, కిందిస్థాయి అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు అనే విమర్శలకు తలెత్తుతున్నాయి. పంట నష్టం జరిగిన రైతులను పూర్తి స్థాయిలో సర్వే చేయడంలో మండల వ్యవసాయ అధికారి,గ్రామ అధికారులు విఫలమయ్యారు అని ,సర్వే లో జాప్యం జరిపినదుకు ఉన్నత అధికారిని విధులనుండి తొలగించిన కిందిస్థాయి అధికారుల్లో చలనం రాకపోవడం వెనుక తారతమ్యం ఏంటో అర్థం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు నష్టపోయిన రైతులకు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించేలా చూడాలని,పంట నష్టం పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే రిపోర్ట్ పంప్పించడంలో ప్రభుత్వాన్ని ,ప్రజలను మోసం చేస్తు తప్పుడు సర్వే రిపోర్ట్స్ ను ప్రభుత్వానికి పంపిస్తూన్న మండల,గ్రామ వ్యవసాయ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుకుంటున్నారు.