Wednesday , September 18 2024

తృటిలో తప్పిన పెను ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూన్:-23

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం మెయిన్ రోడ్డు లో సిరివెన్నెల షాపింగ్ మాల్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడం గమనించిన అప్పుడే విధులు ముగించుకొని వెళుతున్న హోం గార్డ్ షహనాజ్ ఎదురుగా ఉన్న దుకాణం యజమానికి సమాచారం ఇవ్వడం తో అతను షాపింగ్ మాల్ నిర్వాహకులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఎగ్జిటింగ్ మిషన్ తో మంటలు దుకాణం లోనికి వ్యాపించకుండా చేయడం తో భారీ అగ్ని ప్రమాదం తప్పింది ఎన్ఎస్ఓ ఆర్ ఐ కుమారస్వామి షాపింగ్ మాల్ కు చేరుకొని దుకాణం ముందు అగ్ని ప్రమాదానికి గల కారణాలను యజమానులను అడిగి వివరాలు
తెలుసుకున్నారు
విధిగా సీసీ కెమరా లు ఉండాలని సూచించారు
వీరి వెంట ఎన్ ఆర్ ఓ విధులు నిర్వహిస్తున్న వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు
పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న
హెడ్ కానిస్టేబుల్ గంగరాజు
బ్లూ కోట్ ప్రవీణ్ లు ఉన్నారు