Sunday , May 26 2024

తీజ్ ఉత్సవాల లో పాల్గొన్న గోలి మోహన్

*రాజన్న సిరిసిల్ల జిల్లా::// వేములవాడ**

వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం రాజారాం తండాలో బంజారా సోదరీ సోదరీమణులు నిర్వహించిన తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్ ఈ సందర్భంగా రాజారాం తండాలోని గ్రామ సర్పంచ్ తిరుపతి నాయక్ మరియు మహిళలు యువకులు డాక్టర్ గోలి మోహన్ గారిని డప్పులతో ఘనంగా ఊర్లోకి ఆహ్వానించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన రాజారాంతండాకు రావడం నిజంగా మా అదృష్టం అని మీలాంటి నాయకుడు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని మా గిరిజన బిడ్డలకు కూడా దారి చూపాలని మాకు ఎవరు కూడా ఇప్పటివరకు చదువుకోవాలి ఉద్యోగంలో ఉండాలి ఉన్నతంగా ఎదగాలని చెప్పిన నాయకుడు లేడని మా ఓట్లను మాత్రమే వాడుకొని మమ్మల్ని పట్టించుకోవడంలేదని రాజారామ్ తండా ప్రత్యేక గ్రామపంచాయతీ అయినప్పటికీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవని కానీ మీలాంటి మంచి మనసున్న యువ నాయకుడు మాకు కావాలని మేమందరము రాబోయే రోజుల్లో మీ వెనువెంట ఉంటూ మీ గెలుపుకు సహకరిస్తామని అన్నారు డాక్టర్ గోలి మోహన్ గిరిజన బిడ్డలు అడవిని నమ్ముకుని బతుకుతారని అలాంటి వారికి చదువు పైన నమ్మకం కలిగే విధంగా నేను ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరిని ఆదుకుంటున్నానని రాబోయే రోజుల్లో ఈ తండాను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తానని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తానని మన తండా నుంచి కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఉన్నారు తర్వాత గ్రామ సర్పంచ్ యువకులు డాక్టర్ గారిని ఘనంగా సత్కరించారు*