Thursday , May 23 2024

తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారన్న ఆరొపణలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి పై అనర్హత వేటు….

తెలంగాణ కెరటం మార్చ్ 3 నర్సాపూర్ ప్రతినిధి :నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి పై అనర్హత వేటు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎంపీడీవో మార్టిన్ లూథర్ తెలిపారు .శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఎంపీపీ జ్యోతి తప్పుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి నామినేషన్ కు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినట్లు ఆయన తెలిపారు. అయితే ఎంపీపీ జ్యోతి నామినేషన్ వేసి సమయానికి 18 సంవత్సరాల నిండకపోయినా 18 సంవత్సరాల నిండినట్లు పుట్టిన తేదీ విషయంలో తప్పుడు దువపత్రాలు సృష్టించి ఎన్నికల్లో గెలుపొందారని చిప్పల్ తూ ర్తీ ఎంపీటీసీ సంధ్యారాణి జక్కపల్లి సర్పంచ్ వెంకటలక్ష్మి లు గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు, ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో స్క్రూట్ ని కమిటీ నీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అదనపు కలెక్టర్ రమేష్ ,సీఈవో శైలేష్ కుమార్ ,నర్సాపూర్ ఆర్డీవో సాయిరాం, నర్సాపూర్ ఎంపీడీవో మార్టిన్ లూథర్, హత్నూర పాఠశాల హెచ్ఎం లతో కమిటీని ఏర్పాటు చేశారు ,,ఈ కమిటీ విచారణ చేపట్టి గతంలో జ్యోతి చదువుకున్న హత్నూర పాఠశాలకు వెళ్లి పుట్టిన ధ్రువ పత్రం ఆధార్ కార్డు పై ఉన్న పుట్టిన తేదీ కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్ పై పుట్టిన తేదీ నీ పరిశీలించగా మూడింటిలో వేరువేరుగా ఉన్నాయి కమిటీ నిర్ధారించారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి జ్యోతి వయసు 17 సంవత్సరాల 8 నెలల 16 రోజులు ఉన్నట్లు విచారణలో తేలిందని అన్నారు .ఈ విచారణలో తేలిన నివేదికను కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు .జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో శైలేష్ కుమార్ ఎంపీపీ జ్యోతి పై అనర్హత వేటు వేస్తూ ఉత్తర వీలు జారీ చేశారని ఎంపీడీవో మార్టిన్ లూథర్ తెలిపారు .ఎంపీపీ జ్యోతి కి నోటీసులు అందిన వెంటనే ప్రస్తుత వైస్ ఎంపీపీ గా వ్యవహరిస్తున్న పి వెంకట నర్సింగరావుకు ఎంపీపీ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *