Wednesday , September 18 2024

తమ్ముడిని హత్య చేసిన అన్న

తమ్ముడిని హత్య చేసిన అన్న

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాల గ్రామం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజ్జు పటేల్ ని సొంత అన్నయ్య రాజు పటేల్

ఆదివారం తెల్లవారుజామున కత్తితో దారుణంగా పొడిచి హత్య చేయడం జరిగింది అని మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరిగింది. వివరాలకు వెళితే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదాలకు పాల్పడి హత్య చేశాడని ఎస్ఐ కృష్ణారెడ్డి

గ్రామస్తులతో సమావేశం జరిపి విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరిగింది. హత్య చేసిన హంతకుడి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. అంత్యక్రియ లో జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంత్ షిండే

పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఎమ్మెల్యే తో పాటు మద్నూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.