Monday , September 16 2024

మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన కసాయి కొడుకు

తెలంగాణ కెరటం జనవరి 7 సూర్యపేట జిల్లా అనంతగిరి

మండల పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామం, సుందరయ్య కాలానికి చెందిన పుట్టబంతి వీరేశం తండ్రి లేట్ నాగభూషణం, వయస్సు: 35 సం.లు, కులం: ఎరుకల, వృతి: సుతారి మేస్త్రి, అను అతను గత కొంతకాలంగా త్రాగుడుకు బానిసై తన భార్య శిరీష ను శారీరకంగా, మానషికంగా వేధించడం వలన తన పుట్టింటికి వెళ్ళిపోయినది. వీరేశం తన తల్లి పుట్టబంతి రాములమ్మ, వయస్సు: 70 సం.లు, ఇద్దరు కలసి తమ్మర లో కిరాయికి రూమ్ తీసుకొని ఉంటున్నారు. తేది 06.02.2024 సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో పుట్టబంతి వీరేశం, బాగా మద్యం సేవించి మద్యం మత్తులో తన తల్లి రాములమ్మతో గొడవపడి గొంతు నులిమి చంపినాడని, మృతురాలి కూతురు నల్లగొండ రమణ భర్త మహేష్ ఫిర్యాదు చేయగా, తన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి పత్రిక విలేకరులకు తెలియజేశారు.