Saturday , October 12 2024

అమ్మ కొట్టిందని బాలుడు ఆత్మహత్యసూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూలై:14

రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో విషాదం నెలకొంది.గ్రామంలోని తండా కు చెందిన రాజు-జ్యోతి దంపతుల కుమారుడు దినేష్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు.
అమ్మ తనని అమ్మ కొట్టిందని అటవీ ప్రాంతంలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంటున్నానని తన స్నేహితులకు ఓ వీడియోను పంపి
గురువారం ఉరేసుకున్నాడు. ఈ రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యం కాగా పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు