Wednesday , September 18 2024

తల్లిని హతమార్చిన కూతురు

తల్లిని హతమార్చిన కూతురు

నందిపేట మండలం
ఉమ్మెడ గ్రామానికి చెందిన మృతురాలు నాగం నర్సు W/o కీ.శే బోజన్న,వయస్సు: 52సం,, కులం: Sc మాదిగ, వృత్తి: లేబర్, తన భర్త 20సం,, క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది, ఆమె ఇంటి లోనే ఒక రూం లో ఆమె కూతురు నాగం హరిత వయస్సు: 28సం వేరుగా ఉంటుంది.తల్లి కుతుర్ల మధ్య గత కొన్ని సం,, నుండి కుటుంబ విషయాలలో గొడవలు జరుగుతున్నాయి.మొన్న తేదీ 26/05/2023 నాడు మధ్యాహ్నం మృతురాలి రెండవ కూతురు అరుణ ఇంట్లో జరిగిన ఫంక్షన్ (తొట్లే) కి వచ్చిన వారిని మృతురాలు తిట్టగా,

ఆ విషయంలో మృతురాలికి , మరియు పెద్ద కూతురు హరిత కు గొడవ జరిగింది.ఈ గొడవలో కూతురు ,తల్లిని రోకలి దొడ్డు రాయితో ఇష్టం వచ్చినట్లు తల పైన, మొహం పైన కొట్టి పడవేసీ,వెళ్ళిపోయింది.తిరిగి నిన్న అనగా తేదీ 27/05/2023 నాడు జరిగిన విషయాన్ని మృతురాలి పెద్ద కూతురు తన చెల్లెలికి మరియు బంధువులకు ఫోన్ లో తెల్పగా మధ్యాహ్నం మృతురాలి రెండవ కూతురు మరియు బందువులు వచ్చి చుడాగ తల్లి నర్సు చనిపోయివుంది.మృతురాలి మేనల్లుడు గణపురం రవి వయస్సు: 35సం,, నవిపెట్ గ్రామస్థుడు ఇచ్చిన ధరకాస్తు మేరకు నిన్న రాత్రి కేసు నమోదు చేసుకొని ,దర్యాప్తు లో బాగంగా ,మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ కి తరలించగా ఈ రోజు పోస్ట్ మార్టం చేయడం జరిగింది.