Tuesday , July 16 2024

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేల ఆర్మూర్లో జాతీయ జెండాకి అవమానం

తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 02:
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో
ప్రత్యేక తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారం అంగరంగ వైభవంగా రాష్ట్ర మొత్తం సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో వెలుగుతున్న మన జాతి తెలంగాణ ప్రగతి నలు దిశలు చాటి చెబుతున్న వేళ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్లాక్ టవర్ టవర్ వద్ద జాతీయ జెండా చిరిగిన మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వలన మరమ్మతుకు నోచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది .ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యాలయాల ముందు జెండాను ఎగురవేస్తున్న తరుణంలో ఆర్మూర్ ఐకాన్ గా క్లాక్ టవర్ జెండాను చెప్పుకుంటాం భారీ జెండా క్లాక్ టవర్ ప్రత్యేకత ఇలాంటి జెండాను గాలికి చిరిగినా కూడా అధికారులు పట్టించుకోక సంబరాలలో మునిగి తేలడం విడ్డూరంగా ఉంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. గతంలో కూడా జెండా జరిగిన విషయం మన పత్రికలలో వచ్చిన నామమాత్రంగా సరి చేసి పెట్టడం జెండా చిరిగిన విషయం తెలిసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఉన్నాయి అని తెలిసిన అధికారులు జాతీయ పతాకం అలానే ఉంచడం మున్సిపాలిటీ అధికారుల పనితీరుకు నిదర్శనం ఇకనైనా అధికారులు ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.