Thursday , November 7 2024

అంతర్జాతీయ రహదారిపై కాలుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని స్థానిక జక్లేర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా లక్షలాది రూపాయలు వేచించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షణ కొరకు ట్రీగార్డ్స్ అమర్చి దాని కొరకు ఉపాధి హామీ కింద ఎన్నో లక్షల రూపాయలు వేచి మొక్కలను పెంచితే ఆ మొక్కలు నేడు కొంతమంది వ్యవసాయ పొలాల సమీపంలో ఉండేవారు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి ఇకనైనా ఉన్నతాధికారు స్పందించి మొక్కలను కాపాడాలని ప్రభుత్వ నిధులను కాపాడాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు వాహనాదారులు రోడ్డుపై వెళ్తుండగా పెద్ద ఎత్తున మంటలు పొగలు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.