Wednesday , July 24 2024

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు అర్ధరాత్రి వరకు తహసిల్దార్ నిర్బంధం

. అర్ధరాత్రి వరకు తహసిల్దార్ నిర్బంధం

తెలంగాణ కెరటం

కాగజ్ నగర్ రెండు పడకల గదుల, ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని వార్డు నెంబర్ 9కి చెందిన దరఖాస్తు దారులు ఆరోపిస్తూ కాగజ్ నగర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు, అన్ని వార్డులలో లక్కీ డ్రా లు వార్డు సభ్యుల ముందు తీశారు 9వ వార్డు మాత్రం ఎమ్మార్వో కార్యాలయంలో తీసి పేదలకు అన్యాయం చేశారని అన్నారు ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు
దరఖాస్తు దారుల. ధర్నాకు మద్దతుగా బిఎస్పి సిర్పూర్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అర్షద్ హుస్సేన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు రావి శ్రీనివాస్ ధర్నా చేస్తున్న బాధితులకు మద్దతు తెలిపారు. అర్ధరాత్రి 12 దాటిన ధర్నా విరమించకపోవడంతో.
బాధితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది,
పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో రాత్రి 12:10″ తహసిల్దార్ ప్రమోద్ కుమారును. పోలీస్ బందోబస్తు మధ్య ఇంటికి తరలించారు.
నాయకులను తరలించే క్రమంలో బాధితులకు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది.
రాత్రి 12:30 గంటలకు డిఎస్పి కరుణాకర్ బాధితులతో చర్చలు జరపడంతో తహసిల్దార్ కార్యాలయం
నుoచి వెళ్లిపోయారు.
కాగజ్ నగర్ టౌన్ ఎస్ హెచ్ ఓ బుద్దే స్వామి , రూలర్ సిఐ నాగరాజు,ఎస్ఐలు సోనియా, రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *