Wednesday , September 18 2024

అపోలో డయాగ్నస్టిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ కెరటం సూర్యాపేట ఫిబ్రవరి 18 : జిల్లా కేంద్రంలోని పదో వార్డు జాహ్నవి టౌన్ షిప్ లో తాన్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వారి సహకారం తో అపోలో డయాగ్నస్టిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో బిపి, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్,పరీక్షలు ఉచితంగా చేస్తూ మిగిలిన పరీక్షలు రాయితీ తో కూడిన ప్యాకేజి ఇస్తున్నట్లు తాన్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆర్ యం పి డా. ఎస్ ప్రవీణ్ అన్నారు.అపోలో ఆయుష్ కాంప్రెసివ్ 70 టెస్ట్ లు రూ.8385 ల విలువ గల టెస్ట్ లు కేవలం రూ.3999లకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నట్లు అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ఇంచార్జ్ రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.