- పోరాడే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నుఅత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం
- ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి మే 20:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పట్టభద్రుల వైపు ఉంటుంది అని,పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నుఅత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో శాసనమండలి పట్టపద్రుల ఎన్నికల సమావేశం లో మాట్లాడారు.మల్లన్న మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వ పాలకులపై కొట్లాడి ప్రభుత్వాన్ని గద్దదించే వరకు పోరాడిన వ్యక్తిని అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నా వెన్ను తట్టి నిలిచారని అన్నారు.ఇప్పుడు జరిగేది మేధావుల ఎన్నిక కాబట్టి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ను రద్దు చేసే పార్టీ వాళ్లు వస్తున్నారు, మరోపక్క అదే పార్టీకి సపోర్ట్ చేసే పార్టీ వాళ్ళు వస్తున్నారు తస్మాన్ జాగ్రత్త అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇండియా కూటమి భారత రాజ్యాంగాన్ని, పేద ప్రజలను రక్షించే కూటమి సూర్యాపేటలో వార్ వన్ సైడ్ మాత్రమే ఉండాలని కోరారు.కెసిఆర్ మీద ప్రజల కోసం కొట్లాడితే నా కుటుంబం పైన చిత్రహింసలు గురిచేశారన్నారు. ఈరోజు అదే పరిస్థితి కెసిఆర్ కూతురుకు రాలేదా అని హెచ్చరించారు. ఇదే సూర్యాపేటలో మంత్రి రెండు డీసీఎంలలో జనాల్ని పంపించి నా ఆఫీస్ పైన దాడి చేయించారు.అలాంటి వాళ్ళను శ్రీకృష్ణ జన్మభూమికి పంపించే రోజులు దగ్గరపడ్డాయని గుర్తుంచుకోవాలన్నారు. కెసిఆర్ ఉద్యోగులకు 317 జీవో తీసుకొచ్చి భార్యా పిల్లల్ని దూరం చేశారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లో గ్రూప్1,గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ ఎస్ సి, ఇంజనీరింగ్ కోర్సులలో అన్నిట్లో స్కాములు జరిగాయని, 30 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్డర్ కాపీ ఇచ్చి సీట్లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఉద్యోగుల సిపిఎస్ విధానాన్ని తొలగించి జిపిఎస్ విధానం తీసుకొస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని తెలిపారు. పేదవాడికి కష్టం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదవాళ్ల తరఫున ఉంటుందని, ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలు తప్పకుండా చెల్లించే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వార్ వన్ సైడ్, తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ఉంటుందని సూర్యాపేట జిల్లాలోని అన్ని ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పట్టభద్రుల వైపు ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం మీద ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, పోరాడే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నుఅత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ మొట్టమొదట సూర్యాపేటలోనే ఉంటుందని అన్నారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, చకిలం రాజేశ్వరరావు, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,పిసిసి సభ్యులు కొప్పుల వేనారెడ్డి,రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, సిపిఎం నాయకులు మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి, అంజద్ అలీ, ధరావత్ వీరన్న నాయక్, సురేష్ రావు, కాకి కృపాకర్ రెడ్డి,కేక్కిరేణి శ్రీనివాస్, దామిడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.