Wednesday , July 24 2024

ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదకరం బిజెపి

  • డా. పరకాల ప్రభాకర్ రచయిత రాజకీయ ఆర్ధిక విశ్లేషకులు

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మే 09 : భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలు అయిన లౌకిక ప్రజాస్వామ్యం,సామాజిక న్యాయానికి పబ్లిక్ రంగ సంస్థల కు బిజెపి ప్రమాదకారిగా తయారైందని రచయిత రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ విమర్శించారు.స్ధానిక ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే అంశంపై జరిగిన సెమీనార్ లో ఆయన మాట్లాడుతూ భారత పౌరులపై ఒక ఉన్మాద భావోద్వేగ విషప్రయోగం చేస్తూ దేశసంపదను కొన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న బిజెపి ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజావ్యతిరేక విధానాలను ప్రశించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. భారత వ్యవసాయాన్ని దెబ్బ తీసే రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయొద్దు అని నిరసన తెలిపిన రైతుల పై సైన్యాన్ని ఉపయోగించి రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా అవినీతిని చట్టబద్ధం చేశారనీ విమర్శించారు.ఇప్పటికే అప్రకటితంగా రాజ్యాంగాన్ని నీరు గరుస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగ విలువలు రక్షించ బడాలి అంటే న్ బిజెపి నీ ఓడించాల్సిందేనని ఆయన అన్నారు.ఈ సెమినార్ లో కుంచం చంద్రకాంత్, వీరేశ్ నాయక్ లు సమన్వయ కర్తలు గా వ్యవహరించగా తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్మార్జున్,టి పీజాక్ నాయకులు రవి చందర్ లు ప్రసంగించారు. పలువురు ప్రజసంఘ నాయకులు డాక్టర్ లు న్యాయవాదులు పాల్గోన్నారు.ప్రమాదం లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సూర్యాపేట : జిల్లా కేంద్రం లో ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో గురు వారం ధర్మార్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ముఖ్య అతిధిగా డా. పరకాల ప్రభాకర్ రచయిత రాజకీయ ఆర్ధిక విశ్లేషకులు పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదం లో పడింది అని ఇప్పటికైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రవి శంకర్, తదితరులు పాల్గొన్నారు.