Sunday , May 26 2024

తుమ్మల పెన్ పహాడ్ గ్రామం లో ప్రేమ జంట ఆత్మ హత్య

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ఏప్రిల్ 29 :జిల్లా లోని ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్‌ పహాడ్‌ గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. తుమ్మల పెన్‌ పహాడ్‌ గ్రామ శివారు కృష్ణ సముద్రం కు చెందిన సళ్లగుండ నాగజ్యోతి.తుమ్మల పెన్ పహాడ్ కు చెందిన గుండగాని సంజయ్‌(25) లు గత 5 సంవత్సరముల నుండి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.