Thursday , November 7 2024

గ్రీన్ఉడ్ పాఠశాలలో ఘనంగా ఆన్యువల్ అవార్డ్స్ సెరిమని

ముఖ్య అతిధులుగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సందీప్ భాగ ఐ అర్ ఎస్

తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మన మంచిని కోరతారు

విద్యార్థులు లక్ష్యం కోసం శ్రమించాలి

నైనా జైస్వాల్

విద్యార్థులు కలలను నెరవేరుస్తూ ఆశయాల వైపు పరుగెత్తాలి

సందీప్ బాగా ఐఆర్ఎస్

తెలంగాణ కెరటం ఫిబ్రవరి 17 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

హుజూర్నగర్ పట్టణం లోనీ గ్రీన్ఉడ్ పాఠశాలలో ఆన్యువల్ అవార్డ్స్ సెరిమని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యంగెస్ట్ పీహెచ్డీ హోల్డర్, ఇంటర్నేషనల్ టేబల్ టెన్నిస్ ప్లేయర్ డా. నైనా జైస్వాల్, మిస్టర్ సందీప్ బాగా ఐఆర్ఎస్ విచ్చేయగా పాఠశాల యాజమాన్యం వారు వారికి స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో, డా. నైనా జైస్వాల్ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ, తల్లి తండ్రులు, గురువులు జీవితంలో ఎప్పుడు మన మంచినే కోరుతారని జీవితంలో ఒక లక్ష్యానీ నిర్ధేషించుకొని ఆ లక్ష్యం కోసం ఎల్లపుడూ శ్రమించాలని పెర్కున్నారు. మిస్టర్ సందీప్ బాగా ఐ‌ఆర్‌ఎస్ మాట్లాడుతూ, విధ్యారులు జీవితంలో తమ కలలను నేరవీర్చుకోవాలని, ఆశయాలవైపు గా ఆలోచనలు ఉండాలని సెల్ ఫోన్ వినియోగం పిల్లలపై ప్రభావాం దాని యొక్క పరిణామాల గురించి వివరించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తుమ్మా సరితా మర్రెడ్డి, కరస్పాండెంట్ కృష్ణ రావు, ప్రిన్సిపల్ రాజారెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు మరియు తల్లి దండ్రులు పాల్గొన్నారు.