తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ఏప్రిల్ 15 : కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని వాణిజ్య భవన్ సెంటర్ లో సోమవారం చల్లని మజ్జిగ ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి బిజెపి సీనియర్ నాయకులు జుట్టు కొండ సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లే వారికి మరియు పాదాచారులకు భగ్గు మంటున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఎండాకాలం ప్రజల దాహం తీర్చడానికి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం లో ఉండే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వాణిజ్య భవన్ సెంటర్ లో ఏర్పాటు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో కర్నాటి కిషన్, కర్నాటి రామ్మూర్తి, కర్నాటి సుధాకర్ ,అల్లుడు బిడ్డ కక్కిరేణి పృథ్వి కుమార్, స్వాతి,గుండా వెంకన్న,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు