- చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వచ్చారు.. పరిశీలించారు
- 15 రోజులు అవుతున్న కేసు నమోదుచేయలేదు
- అనుమానితుల పేర్లు చెప్పిన పట్టించుకోవడం లేదు
- విలేకరుల ముందు గోడు వెల్లబోసుకున్న బాధితుడు ధరావత్ రవి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : జిల్లా కేంద్రంలోని ఐదవ వార్డు బలరాం నాయక్ తండ వద్ద జాతీయ రహదారిపై ధరావత్ రవికి చెందిన దుర్గాభవాని కిరాణా షాపులో 15 రోజుల క్రితం దొంగలు పడ్డారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి క్లూజ్ టిమ్స్, డాగు స్కడ్స్ వస్తాయని చెప్పి వెల్లి నేటి వరకు ఎలాంటి విచారణ చేయకుండా కేసు నమోదు చేయలేదని ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేయాలని బాధితుడు ధరావత్ రవి విలేకరుల ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. బాధితుడు రవి తెలిపిన వివరాల ప్రకారం గత 15 రోజుల కిందట కిరాణా షాపులో అర్ధరాత్రి దొంగలు పడి మూడు లక్షల నగదు రెండు తులాల బంగారం దోచుకుపోయారు. ఈ విషయమై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారు. కాగా రవి దుకాణంలో దొంగతనం జరగడానికి మూడు రోజుల ముందు కొందరు యువకులు గొడవ పెట్టుకుని వెళ్లారని వారిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అయినప్పటికీ నేటి వరకు పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేయకపోవడంతో పాటు సదరు అనుమానితులను పిలిపించి విచారించడం లేదని రవి ఆరోపించాడు. కొద్దిరోజుల క్రితం 10 లక్షల బ్యాంకు లోను తీసుకోగా అందులో 7 లక్షల అప్పులకు పోను మిగిలిన మూడు లక్షల నగదును దుకాణంలోనే పెట్టినట్లు తెలిపాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదని పైసా పైసా పోగు చేసుకుని దొంగలపాలు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఇప్పటికైనా స్పందించి నా విషయంలో కేసు నమోదు చేసి సదరు అనుమానితులను విచారించి దోచుకెళ్లిన నగదును రికవరీ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.