Tuesday , July 16 2024

టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ఏప్రిల్ 11 :

మహాత్మ జ్యోతి రావుపూలే జయంతి ని గురువారం టీఎస్ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే నిమ్నజాతి కులాల అభివృద్ధికి మహిళా విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య,ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అరుణభారతి,జిల్లా కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు సిహెచ్ వీరారెడ్డి,బి ఆడం జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె అనిల్ కుమార్, చిలుక రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ డి శ్రీనివాస్ చారి,సాంస్కృతిక కమిటీ కన్వీనర్ బి ఆనంద్ వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఆర్ సత్యనారాయణ,ఏ సీనయ్య,బి రమేష్,ఎన్ సైదా,డి నరేందర్,ఎం యాదయ్య, బి శ్రీను,చంద్రు, జే నాగయ్య,డి కృష్ణ,పి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.