- నాణ్యమైన విద్యతోనే అద్భుతమైన సమాజం తయారవుతుంది
- మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ఏప్రిల్ 11: సమాజ మార్పు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల స్ఫూర్తిని బావి తరాలకు అందించాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారయణ పిళ్లే అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపిన మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. మన దేశం వెనుకబడెందుకు కారణం దేశంలో 90 శాతం మందికి విద్య లేకపోవడమేనని అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అందాలని స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందించాలని ఆలోచనతో దేశంలో అట్టడుగు వర్గాలకు విద్యను అందించిన ఘనత జ్యోతిరావు పూలే దే అన్నారు. విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి సమాజానికి నాణ్యమైన విద్యను అందిస్తే అది అద్భుతమైన సమాజంగా అవుతుందని బలంగా నమ్మి నాడు ఎంతో మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడన్నారు. తన సతీమణి సావిత్రి బాయి పూలే కు చదువు చెప్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసిన ఘనత పూలేదే అని కొనియాడారు. పూలే అడుగుజాడల్లో సావిత్రిబాయి సైతం వితంతువులకు వివాహాలు చేయడంతో పాటు వారికి విద్యను అందించడంలో విశేష కృషి చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హాస్సేన్, కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, అనపర్తి రాజేష్, కుంభం రాజేందర్, ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్, నాయకులు చలమల్ల నరసింహ, కంచుకోముల వెంకట్, భూపతి నారాయణ, గైగుల్ల మహేష్ యాదవ్, ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.