Wednesday , July 24 2024

పాస్టర్స్ పెలోషిఫ్ ఆధ్వర్యంలో దేశం కొరకు ప్రార్ధన

  • జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 :జిల్లా లోని ఆత్మకూర్ (యస్ ) మండలం నెమ్మికల్ గ్రామం లో డబ్ల్యూ. యం. ఇ. షాలోమ్ ప్రార్ధన మందిరం నందు ఆత్మకూర్ (యస్) మండలం అధ్యక్షులు రెవ. డా. జి. శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ భారత దేశ సమైక్యత కొరకు పాటుపడాలని,భారతదేశం సెక్యులర్ దేశం అనీ అన్నీ మతాలకు, కులాలకు భిన్నత్వం లో ఏకత్వం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు ఐ. పి.సి. ఎలషడ్డాయి ప్రార్ధన మందిరం తాళ్లగడ్డ పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ లు పాల్గొని దేశం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. వాక్యపదేశకులు రెవ. డా. పంది మార్కు ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ యడవెల్లి అబ్రాహాము, రెవ. పుల్లూరు బోయాజ్, పాస్టర్ సూరబోయిన దావీదు, శ్యాగ యాకోబు, బానోత్ సుధాకర్, దారావత్ సైదా నాయక్, నకిరేకంటి సైమన్, బొల్లెద్దు మోజెస్, చిల్కూరి బాలరాజు, నర్సింహా చారి,పాస్టర్ రెవ. డా. జలగం జేమ్స్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు