Thursday , November 7 2024

నిరసనలతో ఎరుపెక్కిన పలు మండల కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వ మోధి వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని

అఖిల పక్షం కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిరసనలు

తెలంగాణ కెరటం ఫిబ్రవరి 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

కార్మికుల హక్కులను పరిరక్షించాలని గ్రామాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వారికి తగిన గుర్తింపు నివ్వాలని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండల కేంద్రాలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ సమ్మెలో భాగంగా అఖిలపక్ష కార్మికుల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నా కార్మికులు ఎర్రజెండాలు చేపట్టి విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రాలలో ప్రతి యూనియన్ కార్మికులు గ్రామీణ బంద్ సమ్మె కు గ్రామీణ ప్రాంత ఉద్యోగులు ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న, ఉపాధి హమీ,హమాలీ కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేశారని కార్మికులు చాలి చాలని వేతనాలతో నేడు పెరిగిన నిత్యావసర ధరలకు సరిపోక అవస్థలు పడుతున్నారని బిజెపి ప్రభుత్వం అంబానీ, అదానిల పెద్ద పీట వేస్తూ గ్రామీణ స్థాయి కార్మికులను పట్టించు కోవడం లేదని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు వారి సిబ్బంది గ్రామీణ ప్రాంత కార్మికులు పాల్గొన్నారు