Sunday , May 26 2024

జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలి…

క్రీడారంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 31 : క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సూర్యాపేట జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట బాస్కెట్ బాల్ క్లబ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించి మాట్లాడారు.మానసిక దృఢత్వానికి శారీరక బలోపేతానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు.క్రీడారంగ అభివృద్ధికి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. త్వరలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో బాస్కెట్ బాల్ ఎంతో ప్రాచుర్యం పొందిందని దేశంలో కొంత ఆదరణ తక్కువగా ఉందని, క్రీడాకారులు బాస్కెట్బాల్ పోటీలో విశేషంగా రాణించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఫారూఖ్,గట్టు శ్రీను, షఫీఉల్లా,వెలుగు వెంకన్న,ఎడ్ల వీరమల్లు,తండు శ్రీను, ధర్మ,సూర్యాపేట బాస్కెట్ బాల్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.