ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్
తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా మార్చి 23 : జిల్లా కేంద్రంలోనీ చంద్రన్న కుంట బజార్ లో గల ఎమ్ .ఎస్ రెడ్డి హైస్కూల్లో 7 వ వార్షికోత్సవం ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్ పాల్గొని మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించడంలో కృషి ఎన్న లేనిదని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆవుల వీరభద్రం, డిటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ భాస్కర్, పాఠశాల కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రజిని, సాహితి వేదిక భానుపురి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.