Sunday , May 26 2024

ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దాం

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి లింగయ్య సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీలో చేరిక

   - కొత్తపల్లి శివకుమార్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి

          తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 18 : మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టిఆర్ఎస్ నాయకుడు పిడమర్తి లింగయ్య ఈరోజు జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీలో చేరాడు. వీరికి పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి లింగయ్య చిన్నతనం నుండి జనశక్తి, మారోజు వీరన్న వర్గం తర్వాత కాలంలో ప్రతిఘటనలో పనిచేసి 2009లో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నాడని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉద్యమంలో మమేకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఐక్య కార్యాచరణ కార్యక్రమాలు చేశాడు అన్నారు.ఆ ఉద్యమ స్పూర్తితో ఇప్పుడు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాల ను బలోపేతం చేయాలన్నారు.పార్టీలో చేరిన కామ్రేడ్ పిడమర్తి లింగయ్య మాట్లాడుతు ఈ పది సంవత్సరాల కాలంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎలాంటి ప్రాధాన్యతనీయకుండా బైట నుంచి వచ్చిన వరకు ప్రాధాన్యత ఇచ్చి అసలైన ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు అన్నారు. ఆ అవమానాలను భరించలేక ఆ పార్టీకి దూరంగా ఉంటూ రాజీనామ చేశాను అన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటానికి నా మాతృ సంస్థ అయిన విప్లవ పార్టీయే సరియైనది అని గుర్తించి,ఈ జిల్లాలో ప్రజల తరఫున నిత్యం పోరాడుతున్న విప్లవ పార్టీ  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ అని గ్రహించి ఇందులో చేరడం జరిగింది అన్నారు. ఈ పార్టీ లైన్ లో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎస్కె.సయ్యద్,పద్మ తదితరులు పాల్గొన్నారు.