Saturday , October 12 2024

దత్తాత్రేయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 15 : జిల్లా కేంద్రం లోని సాయినగర్ నందు గల సాయిబాబా ఆలయం నందు మార్చి 14 వ తేదీ నుండి దత్తాత్రేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు నుండి వచ్చిన వేద పండితులు గురువారం, శుక్రవారం నాడు హోమం, వివిధ రకాల పూజలు నిర్వహించారు. శుక్రవారం నాడు దత్తాత్రేయ స్వామి విగ్రహంపై ధాన్యం పోసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గుంటూరుకు చెందిన గోపి కృష్ణ మాట్లాడుతూ శనివారం ఉదయం దత్తాత్రేయ స్వామి పునఃప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తామని, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం వుంటుందని అన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సవరాల సత్యనారాయణ, కమిటీ సభ్యులు , సాయిబాబా భక్తులు పాల్గొన్నారు.