- టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమనిధి చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 15 : టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మైలారపు వెంకన్న సేవలు మరువలేని వని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనియాడారు.
మార్చి మూడవ తేదీన టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మైలారపు వెంకన్నరోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం టీఎస్ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యదర్శి కామ్రేడ్ మైలారపు వెంకన్న సంస్మరణ సభ టీఎస్ యుటిఎస్ భవన్ సూర్యాపేట నందు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మైలారపు వెంకన్న ఒక మంచి గణితఉపాధ్యాయునిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో కృషి చేశారని .అదేవిధంగా అనేక ప్రజా ఉద్యమాలలో, ఉపాధ్యాయ ఉద్యమాలలో అనేక పోరాటాలలో పాల్గొని ఉపాధ్యాయ రంగ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేశారని కొనియాడారు.ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి తరఫున ఆరు లక్షల రూపాయల చెక్కు కుటుంబ సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్రప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ,ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి ,ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కోశాధికారి, జి నాగమణి, నల్గొండ జిల్లా అధ్యక్షులు వై సైదులు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జే యాకయ్య, ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, కే అరుణ, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ నల్లగొండ కన్వీనర్ గేరా నరసింహ,కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్ దామోదర్, బీ పాపి రెడ్డి,N నాగేశ్వరరావు, జే కమల,వీ రమేష్, బి ఆడం, సిహెచ్ రమేష్ ఆర్ శీను, జై క్రాంతి ప్రభ, డి శ్రీనివాసచారి, బి ఆనంద్ ఆర్ సత్యనారాయణ ,బండ్ల రమేష్ , జిల్లా కమిటీ సభ్యులు ,వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు .