Thursday , May 23 2024

రథసప్తమి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు

స్వామివారు 7 వాహనములపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు

తెలంగాణ కెరటం ఫిబ్రవరి 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మట్టపల్లి మహక్షేత్రము నందు శుక్రవారం రధ సప్తమి సందర్భముగా దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు తూమాటి శ్రీనివాసాచార్యులు రామాచార్యులు ఫణి భూచనాచార్యులు పద్మనాభచార్యులు బద్రీనాథ్ చార్యులు లక్ష్మీనరసింహ మూర్తి ఆంజనేయ చార్యులు వారిచే శాస్త్రోత్తముగా శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించబడినవి తదనంతరం శ్రీ స్వామి వారిని మట్టపల్లి మాడవీధుల్లో 7 వాహనములపై (చేసావాహనం సింహవాసం వాహనం గజవాహనం హనుమత్ వాహనం గరుడ వాహనం అశ్వవాహనం రథం) విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త లు ఛైర్మన్ చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్ కుమార్ కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ భక్తులు సిబ్బంది పాల్గొన్నారు